Site icon HashtagU Telugu

Kavitha Vs Sharmila: కవిత, షర్మిల ‘ట్విట్టర్’ వార్, పంచులే పంచులు!

Delhi Liquor scam

Kavitha And Sharmila

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఇందులో భాగంగా కవిత ‘కమలం వదిలిన బాణం’ అంటూ షర్మిలపై ఆసక్తికర ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్ గా షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన పాదయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో మంగళవారం షర్మిల ప్రగతి భవన్ ను ముట్టడించి, అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,  వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.

షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండటంతో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ‘కమలం వదిలిన బాణం’’ అంటూ ట్వీట్ చేసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, బీజేపీ పార్టీ ఒక్కటే అనే అర్థంతో కవిత ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ నెట్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో, కవిత ట్వీట్‌కు షర్మిల కౌంటర్ ఇచ్చింది. ‘‘పాదయాత్రలు చేసింది లేదు. ప్రజల సమస్యలను చూసింది లేదు. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవ లేదు’’ అంటూ కౌంటర్ ఇచ్చింది.

షర్మిల ఇటీవలి కాలంలో తన పాదయాత్రలో టీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒంటరిగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రతి విషయంలోనూ షర్మిల టీఆర్ఎస్ పై విరుచుకుపడుతోంది. కాగా షర్మిల అరెస్ట్ ను నిరసిస్తూ గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ షర్మిలకు మద్దతు పలికారు.

Exit mobile version