MLC Kavitha: మహిళలపై బీజేపీ దాడి సరైంది కాదు, ట్విట్టర్ లో కవిత హితవు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. మహిళలను టార్గెట్ చేయడం మనుకోవాలని సూచించారు.

Published By: HashtagU Telugu Desk
Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

MLC Kavitha: మహిళలపై దాడి చేయడం ఆపాలని బిజెపికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ట్విట్టర్లో తెలంగాణ బిజెపి చేసిన ఓ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు..

కాలంచెల్లిన మూస పద్ధతిలో మహిళలలో అవహేళన చేయడం తగదని స్పష్టం చేశారు. మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బిజెపి ఓర్వలేక పోతుందా అని అడిగారు. మహిళ హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని బిజెపిని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Also Read: Naveen Polishetty: షూటింగ్స్ తో బిజీగా ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతాను: నవీన్ పొలిశెట్టి

  Last Updated: 24 Aug 2023, 12:48 PM IST