Site icon HashtagU Telugu

Kavitha : కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్‌

MLC Kavitha to court.. Reserves judgment on CBI custody

MLC Kavitha to court.. Reserves judgment on CBI custody

Kavitha:తనను సీబీఐ అరెస్ట్(CBI Arrested చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha) దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో వాదనలు జరిగాయి. కవితను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదలను విన్న కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా(Adjournment) వేసింది. ఈ పిటిషన్ పై 2 గంటల తర్వాత వాదనలు వింటామని జడ్జి తెలిపారు. మరోవైపు కవితను ఐదు రోజుల కష్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. వాదనలు పూర్తి కావడంతో కవితను కోర్టు రూమ్ నుంచి అధికారులు తీసుకెళ్లారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తున్న సందర్భంగా కవిత మాట్లాడుతూ… తనను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమమని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వాదనల సందర్భంగా… ఈ కేసులో ప్రధాన కుట్రదారు కవిత అని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అప్రూవర్లుగా మారిన శరత్ చంద్ర, మాగుంట రాఘవ సెక్షన్ 161, 164 కింద వాగ్మూలం ఇచ్చినప్పటికీ.. కవిత దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పారు. అభిషేక్ బోయినపల్లి హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారని తెలిపారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని చెప్పారు. ఈ విషయం బుచ్చిబాబు వాట్సాప్ చాట్ లో బయటపడిందని చెప్పారు. శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారని తెలిపారు.

Read Also: Pakistan Man Killed Wife: పాకిస్థాన్‌లో దారుణం.. భార్య‌, పిల్ల‌ల‌ను గొడ్డ‌లితో న‌రికి హ‌త్య‌

కాగా, తీహార్‌ జైలులో కస్టడీలో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఐపీసీ 477, 120(ఆ), పీసీ చట్టం 7 సెక్షన్ల ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. ఆమెను శుక్రవారం ట్రయల్‌ కోర్టులో హాజరుపర్చనుంది. కాగా కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం రౌస్‌ ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రంజాన్‌ సెలవు దినం కావడం, ఈ కేసుకు సంబంధించిన సమాచారం లేదని ప్రతివాదులు చెప్పడంతో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ సాధ్యం కాదని కోర్టు తెలిపింది. రెగ్యులర్‌ కోర్టులోనే ఈ వివాదాన్ని పరిషరించుకోవాలని సూచించింది.