Commission : సీఎం రేవంత్ రూ.20 వేల కోట్లు కమిషన్ నొక్కేసాడు..పక్క ఆధారాలు ఉన్నాయి – ఎమ్మెల్సీ కవిత

Commission : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ, లక్షా 75 వేల ఎకరాల టీజీఐఐసీ భూములను తాకట్టు పెట్టే కుట్ర జరుగుతోందని

Published By: HashtagU Telugu Desk
Kavitha Cng

Kavitha Cng

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) భారీ అప్పులు చేసి, విలువైన భూములను తాకట్టు (Borrowing and mortgaging valuable land) పెట్టే కుట్రల్లో మునిగిపోయిందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ, లక్షా 75 వేల ఎకరాల టీజీఐఐసీ భూములను తాకట్టు పెట్టే కుట్ర జరుగుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు రహస్య జీవో జారీ చేశారని, దీని వెనుక వేల కోట్ల రుణాలు పొందాలన్న రాజకీయ లబ్దిపూరిత లక్ష్యాలున్నాయని ఆమె ఆరోపించారు.

Volunteer System : వామ్మో.. వలంటీర్లకు శిక్షణ పేరుతో రూ.273 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ

తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాలనే ఆలోచన ప్రజా హితానికి విరుద్ధమని మండిపడ్డారు కవిత. ప్రభుత్వం తీసుకున్న రహస్య నిర్ణయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీజీఐఐసీ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టితే నష్టాలెదురైతే ఆ భూముల భవిష్యత్తు ఏమవుతుందో సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పాలని కోరారు. ప్రజల ఆస్తులపై ఈ విధంగా ఆటలాడటం ఘోరమని, టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్‌గా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో గత 16 నెలల పాలనలో రూ.1.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినప్పటికీ అభివృద్ధికి అసలు ఉపయోగించలేదని కవిత విమర్శించారు. మహాలక్ష్మి, తులం బంగారం వంటి హామీలు అన్ని విస్మరించబడ్డాయని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు మరిచి కమిషన్ల కోసమే పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అట్టడుగు స్థాయిలో తగిన ఆధారాలతో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.

  Last Updated: 12 May 2025, 01:45 PM IST