Site icon HashtagU Telugu

MLC Kavitha : రాహుల్ తెలంగాణ కు వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారు – ఎమ్మెల్సీ కవిత

Kavitha Rahu;

Kavitha Rahu;

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) తనదైన శైలి లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫై పంచ్ లు వేసి ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం తో అధికార పార్టీ తో పాటు మిగతా పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేపనిలో పడ్డారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలంతా నిత్యం ప్రజల మధ్య ఉంటూ మరోసారి బిఆర్ఎస్ (BRS) కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఆదివారం బోధన్ (Bodhan) నవిపేటలో ఎమ్మెల్సీ కవిత రోడ్ షో (Roadshow ) నిర్వహించారు. ఈ సందర్భాంగా ఆమె మాట్లాడుతూ..రాహుల్ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని.. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారని..వారిని పట్టించుకోవద్దని అన్నారు. అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచిది గాంధీ కుటుంబం అన్నారు. తెలంగాణకు తీరని మోసం చేసిన గాంధీ కుటుంబం అని, వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

మంచి వాళ్లను ఎన్నుకుందామా లేదా ముంచేవాళ్లను ఎన్నుకుందామా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. మూడు గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా లేదా 24 గంటలు కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? నిరంతరం నీళ్లు ఇచ్చే వాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? కర్నాటక డిప్యుటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వచ్చి ఐదు గంటల కరెంటే ఇస్తామని చెప్తున్నారు. ఐదు గంటల కరెంటు కావాలా లేదా 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? అన్న అంశాలపై ఆలోచన చేయాలని కోరారు.

Read Also : Yuvagalam : నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమైన టీడీపీ – జనసేన నేతలు