MLC Kavitha : కవితను జైలు వ్యాన్‌లోనే తీహార్ జైలుకు తరలించారు..

ఈడీ కస్టడీ ఈరోజు తో ముగియడంతో ఆమెను రౌస్అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా కవితకు కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 10:44 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్ట్ (Arrest) అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను అధికారులు తిహార్ జైలుకు తరలించారు. ఈడీ కస్టడీ ఈరోజు తో ముగియడంతో ఆమెను రౌస్అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా కవితకు కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జైలు వ్యానులో ఆమెను తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. కాగా కవితను తీహార్ జైలు నుంచే విచారణ జరిపే అవకాశాలున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జైలులో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కలపించాలని జైలు సూపరింటెండెంట్ కు కోర్టు ఆదేశాలిచ్చింది. కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి భోజనాన్ని అనుమతించడంతో పాటు నిద్రపోవడానికి పరువులు, చెప్పులు, బట్టలు, బెడ్ షీట్స్, బ్లాంకెట్ కు అనుమతి ఇచ్చారు. అలాగే కొన్ని పేపర్లు, పెన్నులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టాబ్లెట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు బంగారం ధరించేందుకు సైతం కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక కవిత పరిస్థితి చూసి బిఆర్ఎస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీ గదుల్లో ..బెంజి కార్లలో తిరగాల్సిన కవిత నేడు జైలు వ్యాన్ లో వెళ్లడం..నాల్గు గోడల మధ్య ఉండాల్సి రావడం తో వారు తట్టుకోలేకపోతున్నారు.

Read Also : Srisailam: భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం, భక్తుల మొక్కులు