Site icon HashtagU Telugu

Ujjain Mahankali : మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత…!!!!

Kavitha Bonalu

Kavitha Bonalu

తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి మొదలైంది. ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాల పండగ వాతావరణం కనిపిస్తోంది. సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. మహిళలు ఉదయం నుంచి పెద్దెత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ లో శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం సభ్యులు తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించారు. ఉజ్జయినీ మహంకాళిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ రోజు బోనాల పండుగ వచ్చిందంటే ఈ పండగ ప్రపంచవ్యాప్తంగా జరపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రంగం కార్యక్రమం తర్వాత అంబారు ఊరేగింపు ఉంటుందని చెప్పారు. దాదాపు మూడు వేల దేవాలయాలను అభివ్రుద్ధి చేశామని కవిత స్పష్టం చేశారు.