Bathukamma: ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: కవిత

TRSపార్టీ ఆవిర్భావం తర్వాతే...తెలంగాణ పండగలకు గౌరవం దక్కిందన్నారు ఎమ్మెల్సీ కవిత.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 10:48 PM IST

TRSపార్టీ ఆవిర్భావం తర్వాతే…తెలంగాణ పండగలకు గౌరవం దక్కిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ, బోనాలు వంటి పండగలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించి గౌరవం పెంచిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ చూపు కేంద్రం వైపు ఉన్నాయనగానే…ఢిల్లీలో ఇండియాగేట్ దగ్గర బతుకమ్మ వెలుగుతోందన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం ఎగిరే రోజులు దగర్లోనే ఉన్నాయన్నారు.

ఇక బీజేపీపై ఫైర్ అయ్యారు కవితి. హైదరాబాద్ లో సర్దార్ పటేల్ పేరు చెప్పి విమోచనం అంటోంది…అదే పటేల్ విగ్రహంతో గుజరాత్ లో యూనిటీ అంటోందంటూ మండిపడ్డారు. అసలు బీజేపీకి విభజన కావాల..యూనిటీ కావాలో తెల్చుకోవాలన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆరెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు పెద్దెత్తున్న పాల్గొని బతుకమ్మ ఆడారు.