తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు (Telugu States Politics) కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రెడ్ బుక్ (REDBOOK) రాజకీయాలు నడుస్తుంటే…తెలంగాణ లో రాబోయే రోజుల్లో పింక్ బుక్(PINKBOOK) రాజకీయాలు కొనసాగేలా కనిపిస్తుంది. తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణ లో పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం” అని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని..దీనికి ఖచ్చితంగా వడ్డీ చెల్లించుకుంటామని..ఎవర్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదని హెచ్చరించింది.
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి 14 రోజల రిమాండ్
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని విమర్శలు చేస్తుంటారు, కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాడు అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినందుకు కూడా కేసులు పెడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లుపై కవిత స్పందించారు. ” బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో మూడు కొత్త బిల్లులు రూపొందించాలని, విద్య, ఉద్యోగాలు మరియు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని , విద్యలో 46శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాలలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు, స్థానిక ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంకొక బిల్లు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.