MLC Kavitha: ఈడీ ఛార్జ్‌షీట్‌లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు

శవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్‌లో చేరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరును

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 07:55 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్‌లో చేరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరును ప్రస్తావించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కవిత సమీర్ మహేంద్రుని ఫేస్‌టైమ్‌లో రెండుసార్లు, హైదరాబాద్‌లో ఒకసారి కలిసినట్లు తెలుస్తోంది.

ఇండో స్పిరిట్స్‌ను రామచంద్ర పిళ్లై ముందుండి నడిపించారని సమీర్ మహేంద్రూ వెల్లడించినట్లు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి నిజమైన భాగస్వాములని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ఉపయోగించిన 10 సెల్‌ఫోన్‌లను ఆధారాలు లేకుండా ధ్వంసం చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమీర్ మహేంద్రు చార్జిషీట్‌లో పేర్కొంది.

సమీర్ మహేంద్రు చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, మూతం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, దినేష్ అరోరా, విజయ్ నాయర్ పేర్లను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రముఖంగా ప్రస్తావించింది. శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తున్న 5 రిటైల్ జోన్‌ల వ్యాపారాన్ని బోయినపల్లి అభిషేక్‌రావు నిర్వహిస్తున్నారని ఈడీ చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. ఇండో స్పిరిట్స్ ఒప్పందంలో భాగంగానే ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమీర్ మహేంద్రు తమ విచారణలో వెల్లడించినట్లు ఈడీ అభిప్రాయపడింది.

Also Read: చెప్పుతో కొట్టుకుంటావా..? డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు సమీర్ మహేంద్రుని కలిశారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో సమావేశం ముగిసిన అనంతరం శరత్‌చంద్రారెడ్డికి చెందిన చార్టర్డ్‌ విమానంలోనే నలుగురు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లడం ఈడీ చార్జ్‌షీట్‌లో గమనార్హం. ఇండో స్పిరిట్స్ లో ఎల్1 కింద షాపుల్లో కల్వకుంట్ల కవితకు వాటా ఉన్నట్లు తెలుస్తోంది.