Site icon HashtagU Telugu

MLC Kavitha: మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha

Kavitha

MLC Kavitha: హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి గారు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆకాంక్షించారు.

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఎన్నికల ప్రచార సమయం నుంచి ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అది తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాన్‌స్టాప్‌గా స్పీచ్‌లు ఇవ్వడంతో గొంతుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో చలి కారణంగా ఆ సమస్య ఎక్కువైంది. పరీక్షించిన వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు.

Also Read: Parliament: పార్లమెంట్‍పై దాడి చేసిన నిందితులు గుర్తింపు