Kavitha Injured: కవిత కాలికి గాయం.. మూడు వారాలు రెస్ట్!

మంగళవారం తన కాలుకు గాయమైనట్టు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

Published By: HashtagU Telugu Desk
Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

Kavitha Injured: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాలు గాయంతో బాధపడుతోంది. మంగళవారం తన కాలుకు గాయమైనట్టు ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ‘‘నా కాలికి గాయం (Avulsion Fracture) అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’’ అని కవిత రియాక్ట్ అయ్యారు. కాలి గాయం కారణంగా కవిత కొన్ని వారాల పాటు రాజకీయ సభలు, సమావేశాలకు దూరంగా కానుంది. కార్యకర్తలు, నాయకుల కోసం జూమ్ లేదా వీడియో కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

గతంతో కేటీఆర్ 

గతంలో కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్ కాలుకి గాయమైన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఫైల్స్ ను ఇంటికే తెప్పించుకొని విధులు నిర్వహించారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా వర్క్ ఫ్రం హోం చేశారు. ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించారు. అయితే కేటీఆర్ ఓటీటీ లో చూసేందుకు మంచి సినిమాలు కావాలని చెప్పడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: 40 Dogs Killed: జగిత్యాల జిల్లాలో దారుణం.. 40 కుక్కలు హతం!

  Last Updated: 11 Apr 2023, 12:39 PM IST