Bathukamma Celebrations: బతుకమ్మ వేడుకలకు రండి!

బతుకమ్మ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బతుకమ్మ.. తెలంగాణ బతుకమ్మ వేడుకలకు ప్రస్ధిది.

  • Written By:
  • Updated On - September 13, 2022 / 02:01 PM IST

బతుకమ్మ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బతుకమ్మ.. తెలంగాణ బతుకమ్మ వేడుకలకు ప్రస్ధిది. అందుకే దేశవిదేశాలు తెలంగాణ వైపు చూస్తాయి. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో ఎమ్మెల్సీ కవిత ప్రముఖ పాత్ర వహించారు. అందుకుగాను ఆస్ట్రేలియన్ పార్లమెంటు లో జరిగే బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 25న అస్ట్రేలియాలో FINACT అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.

బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త చేసి, బతుకమ్మ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించినందుకుగాను ఈ ఇన్విటేషన్ అందింది. సెప్టెంబర్ 25 న ఆస్ట్రేలియాలో జరగనున్న వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కవితను కోరింది. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ (FINACT) అధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.  FINACT అధ్యక్షులు డా.శాంతిరెడ్డి సమక్షంలో జరుగబోయే వేడుకలకు కవితతో పాటు ఆస్ట్రేలియా ఎంపీలు కూడా పాల్గొననున్నారు.