తెలంగాణలో రాజకీయ వేడి రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా జగిత్యాల నియోజకవర్గం బైఎలెక్షన్ (Bypoll) చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ (BRS) పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay Kumar) కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను జగిత్యాల అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలోకి దింపనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే పార్టీ క్యాడర్, అనుచరులు కవితను పోటీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
#ChatGPT ను ఇలా కూడా వాడతారా? నీ ఐడియా సూపర్ బాస్
ఈ నేపథ్యంలో 2014లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన సంజయ్, 2018లో బీఆర్ఎస్ తరఫున గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారడం వల్ల కవిత రివెంజ్ తీర్చుకోబోతుంది. తన శ్రమ ఫలితం అంతిమంగా కాంగ్రెస్ కు దక్కిందన్న బాధతో కవిత జగిత్యాలలో తిరిగి తనదైన రాజకీయ జోరు చూపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉప ఎన్నికలు జరిగితే, ప్రజల్లో తన తిరుగుబాటు శక్తిని ప్రదర్శించేందుకు కవిత సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కాంగ్రెస్ లో సంజయ్ చేరడాన్ని తిప్పిపొడుస్తున్న జీవన్ రెడ్డి పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఉప ఎన్నిక వస్తే ఆయన తిరిగి పోటీకి ఆసక్తి చూపితే కాంగ్రెస్ లో అంతర్గత సంఘర్షణ ముదిరే అవకాశం ఉంది. మొత్తంగా జగిత్యాలలో ఉప ఎన్నిక జరిగితే, కవిత వర్సెస్ సంజయ్ పోరు హైటెన్షన్ రాజకీయంగా మారనుంది. ఈ ఫైటు తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.