నియంతృత్వ పోకడలకు రేవంత్ సర్కార్ (Revanth Govt) కేరాఫ్ అడ్రెస్ గా మారిందంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శలు చేసింది. ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై విద్యార్థిని శైలజ (Shailaja) (16) మృతి చెందడం అందరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది. ఈ క్రమంలో శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాదవ్‌ను పోలీసులు అడ్డుకోవడం పై కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు రేవంత్ ప్రభుత్వం తూర్పార పొడస్తోందని విమర్శించారు. నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి సర్కార్ నిదర్శనమని అన్నారు.
ఇక శైలజ మృతదేహం ఆసిఫాబాద్ జిల్లా బాదా గ్రామానికి చేరుకున్నది. దీంతో ఆమె బంధువుల, గ్రామస్తులు అంబులెన్స్‌ను చుట్టుముట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆమె డెడ్‌బాడీని అందులోని నుంచి దించకుండా అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అడుగడుగునా మోహరించారు. గ్రామంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలను అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
Read Also : ‘Samantha Second Hand ‘ : ‘సెకండ్ హ్యాండ్’ అంటూ సమంత ను హేళన చేశారట…