తెలంగాణ ఎన్నికల సమయం (Telangana Elections) దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు , ప్రతి విమర్శలు , కౌంటర్లు , ప్రతి కౌంటర్లు విసురుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బస్సు యాత్ర ఫై పెద్దఎత్తున బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రాహుల్ (Rahul) పర్యటన ఫై ఘాటుగా స్పందించారు.
రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు..కేవలం పేపర్ టైగర్ మాత్రమే అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ పట్ల రాహుల్ కు అవగాహన లేదన్నారు. కేవలం కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవడం కాకుండా.. పరిస్థితుల పట్ల అవగాహన తెచ్చుకోవాలన్నారు. రాహుల్ కు తెలంగాణ సంస్కృతి పట్ల అవగాహన లేదని , మళ్లీ ఎప్పుడైనా తెలంగాణకు వచ్చినప్పుడు దోశ బండి వద్ద దోశలు వేసుకుని తినడమే కాదు.. అమరుల కుటుంబాలను కలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత ఏంటదనేది తెలుస్తుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణకు గాంధీ కుటుంబానికి మధ్య విద్రోహక సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవన్ రెడ్డి తన వయసు మరిచిపోయి, దిగజారి మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగిందని తెలిపారు. టిఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు పనికొచ్చే విధంగానే ఉందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి చనిపోయిన వారికి ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు.
ఇక కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీకి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని సైటైర్లు వేశారు. ఇక బీజేపీ అయితే యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు.
Read Also : Cash Seized : ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ కారులో రూ. 3.50 కోట్లు లభ్యం