MLC Kavitha Fire: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ కవిత.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు (MLC Kavitha Fire) చేశారు. పత్రికా సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో రాజకీయ వేడిని మరింత పెంచాయి.
కవిత చేసిన విమర్శలు
కవిత.. జగదీష్ రెడ్డిని “లిల్లీ పుట్ నాయకుడు” అని సంబోధించారు. “నా గురించి కామెంట్స్ చేస్తాడా” అంటూ ఘాటుగా స్పందించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని నాశనం చేసి “చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు” ఏదో గెలిచాడని కవిత విమర్శించారు. జిల్లాలోని అన్ని సీట్లలో పార్టీ ఓడిపోవడానికి జగదీష్ రెడ్డియే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవిత హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
Also Read: Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యం.. ఎంపీ సంచలన ఆరోపణలు!
కోవర్టుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు
ఈ సమావేశంలో కవిత మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో ఒక ముఖ్య నాయకుడు తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు. ఆ నాయకుడికి హెచ్చరిక చేస్తూ “మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు” అని అన్నారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాల వల్లే తనపై జరుగుతున్న దాడులపై పార్టీ నాయకులు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందని కూడా కవిత వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరును, విభేదాలను బహిర్గతం చేశాయి.
బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు తాను రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాను బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటానని చెప్పారు. ఈ ఇష్యూకు తెరపడితే అన్ని విషయాలు సర్దుకుపోతాయన్నారు. అంతేకాకుండా తన ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే పనికూడా ఎప్పుడూ పనిచేయన చెప్పారు.