సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి యూ టర్న్ సీఎం అని , రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినా వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంద్రవెల్లిలో ఉదయం ప్రభుత్వ కార్యక్రమం జరిగితే సాయంత్రం పార్టీ సభ నిర్వహించారని , ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో జరిగిన సభ ఖర్చెంత.? అని నిలదీశారు. తనకు కాన్వాయ్ అక్కర్లేదని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నగరంలో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశారని మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రియాంక గాంధీ నీ ఏ హోదాలో రెండు గ్యారంటీ లకు అమలు చేయడానికి పిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నోట ఏనాడూ జై తెలంగాణ నినాదం రాలేదని అన్నారు. ఒక్కనాడు కూడా అమరులకు నివాళులు అర్పించ లేదని మండిపడ్డారు. ఒక్క అమరవీరుల కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్, మొన్నటి ఎన్నికల్లో 22 కాంగ్రెస్ లోని కుటుంబాలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు..? అటువంటప్పు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా?` అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రభుత్వ హామీలపై 100 రోజుల తర్వాత ప్రజా క్షేత్రంలో ఖచ్చితంగా నిలదీస్తాం అని స్పష్టం చేశారు.
Read Also : Khammam MP Seat : ఖమ్మం ఎంపీ సీటు..ఇది చాల హాట్ గురూ..!!