Site icon HashtagU Telugu

MLC Kavitha : ప్రచారంలో స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

Mlc Kavitha

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha )ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా.. రాయికల్ మండలం ఇటిక్యాలలో శనివారం ప్రచారం చేస్తూ ఒక్కసారిగా ప్రచార వాహనంలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఆమె పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. దగ్గర్లో ఉన్న గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల ఆమె పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాసేప‌టి త‌ర్వాత క‌విత తిరిగి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌సంగించారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను అని పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురై కాసేపు విశ్రాంతి తీసుకున్న కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించారు.

బీఆర్ఎస్‌తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ (Congress) పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని, ఇప్పుడు మరొసారి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అడగడం విడ్డూరంగా ఉందన్నారు.