Site icon HashtagU Telugu

MLC Kavitha: గులాబీల జెండలే రామక్క పాటకు కవిత స్టెప్పులు, వీడియో చూశారా!

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఓ పాట ప్రత్యేకంగా నిలుస్తోంది. కేసీఆర్ ఏసభ పెట్టినా ‘గులాబీల జెండలే రామక్క’ వినిపించడం సర్వసాధారణమైంది. అంతేకాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, రోడ్ షోలోనూ ఈ పాట వినిపిస్తోంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రచార పాటలా ఉన్నా ‘గులాబీల జెండలే రామక్క’ పాట వైరల్‌ అయింది. జనాలను విపరీతంగా ఆకట్టుకుంది

తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవిత ఈ పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. తోటి మహిళ కార్యకర్తలతో కలిసి సందడి చేసింది. పాటకు తగ్గట్టుగా డాన్సు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో పాట ఎంత పోరాటం చేసిందో అందరికి తెలిసిందే. చాలా మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. దివంగత గద్దర్‌ రాసి, పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా వీర తెలంగాణమా’ పాట ఎంతోమందిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించి, ఉద్యమం వైపు నడిపించింది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ‘గులాబీల జెండలే రామక్క’ ఓ ఊపు ఊపుతోంది.

Exit mobile version