Site icon HashtagU Telugu

Caste Census : సీఎం రేవంత్ కు కవిత సవాల్

Mlc Kavitha Challenge To Cm

Mlc Kavitha Challenge To Cm

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) వెల్లడించిన కులగణన(Caste Census)పై రాజకీయ దుమారం రేగుతోంది. కులగణన ను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనను కాంగ్రెస్ “ఎక్స్‌రే, సీటీ స్కాన్” అంటూ చెప్పడం అసత్యమని, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మాయాజాలమని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరిచే నకిలీ ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గణన ప్రక్రియలో పారదర్శకత లేకుండా డేటా సేకరణ జరిగింది. పలు గ్రామాల్లో సరైన సమాచారాన్ని నమోదు చేయలేదని, కొన్ని చోట్ల వర్గీకరణలో గందరగోళం కనిపిస్తోందని వాదిస్తున్నారు. గత 2014లో ముస్లిం ఓబీసీలను విరమించి సేకరించిన డేటాలో ఓబీసీ జనాభా 52 శాతం ఉండగా, తాజాగా విడుదల చేసిన 2024 గణాంకాల్లో ఇది 46 శాతానికి తగ్గిందని ప్రశ్నించారు. ఈ గణాంకాల మధ్య వ్యత్యాసం ఎలా వచ్చింది? అని సూటిగా నిలదీశారు.

Monsoon Trips : వర్షపు చినుకుల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలా?.. అయితే మహారాష్ట్రలో ఈ 8 స్పాట్‌లను మిస్ అవ్వకండి!

ఇది ఒక్కటి మాత్రమే కాదని, ఇలాంటి అనేక విభేదాలు ఈ గణనలో ఉన్నాయని, ఇది నమ్మదగిన డేటా కాదని ఆరోపిస్తున్నారు. డేటాను ప్రామాణికంగా ప్రదర్శించకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ గణన కేవలం ఓ రాజకీయం కోసం చేసి తప్పుడు సంకేతాలు పంపడమే గానీ, వాస్తవికతకు దూరమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. నిజంగా గణన ప్రక్రియ సత్యమైతే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రతి గ్రామానికి చెందిన కుల గణాంకాలను బహిరంగంగా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. “దూధ్ కా దూధ్, పానీ కా పానీ” అయ్యేలా ప్రజల ముందు నిజాలు ఉంచాలని కోరారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఇదే అసలైన పరీక్ష అని వ్యాఖ్యానించారు.