Site icon HashtagU Telugu

Delhi Liquor Scam Case : కవిత కు బెయిల్ రాబోతోందా..?

Kavitha Bail

Kavitha Bail

Delhi Liquor Scam Case లో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కు బెయిల్ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు బలంగా చెపుతున్నారు. గత కొద్దీ రోజులుగా ఆమె బెయిల్ కోసం ఎంతగా ట్రై చేస్తుందో తెలియంది కాదు..ఈ తరుణంలో బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది.  ఇప్పటికే పలు మార్లు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవితకు నిరాశే మిగిలింది. కవితకు వ్యతిరేకంగా కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత మరోసారి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. కాగా ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఎంపీ సంజయ్ సింగ్‌, అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్‌ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేదని , కుమారుడి పరీక్షలు ఉన్నాయని ఇలా ఎన్నో విధాలుగా కవిత బెయిల్ కోసం ట్రై చేసిన బెయిల్ రాలేదు. మరి సుప్రీం కోర్ట్ ఈరోజు బెయిల్ ఇస్తుందా..? అనేది చూడాలి.

Read Also : Trump – Musk : అధ్యక్షుడినైతే కీలక పదవిని ఇస్తానన్న ట్రంప్.. మస్క్ స్పందన ఇదీ

Exit mobile version