Site icon HashtagU Telugu

MLC Kavitha: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత!

Kavitha

Kavitha

హైదరాబాద్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమిషనర్ (Bharat Scouts and Guides-National Guides) గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత (MLC Kavitha) నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఏడాది‌ కాలం పాటు సేవలందించనున్నారు.

2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సేవలందిస్తూ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తాన‌ని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గత కొంతకాలంగా స్కౌట్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కవిత (MLC Kavitha) చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Also Read: KCR Strategy: కేసీఆర్ ‘ఢిల్లీ’ జిమ్మిక్కులు.. మోడీపై ఏడుగురు సీఎంలతో ‘ఢీ’