Delhi Liquor Sam : BRS ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయబోతున్నారా..?

కవితతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం , ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా కవిత, కేజ్రీవాల్‌లకు ఈడీ ఉచ్చు బిగిస్తోందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని

Published By: HashtagU Telugu Desk
Kavitha Arrest

Kavitha Arrest

ఎన్నికల సమయంలో అధికార , ప్రతిపక్ష నేతలను పలు కేసుల్లో అరెస్ట్ (Arrest) చేయడం కామన్..ఈ అరెస్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఏపీలో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి సంచలనం రేపారు జగన్ సర్కార్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అక్కడ ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ తో అంత సైలెంట్ అవుతుందని భావిస్తే..అక్కడ రివర్స్ అవుతుంది. చంద్రబాబు అరెస్ట్ తో యావత్ తెలుగు ప్రజలు వైసీపీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్కామ్ లేని చోట కేసు పెట్టి అరెస్ట్ చేసారని , బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఫై రోజు రోజుకు ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరుగుతుంది. అలాగే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ లో చేరుతున్నారు.

ఏపీలో ఇలా ఉంటె..తాజాగా తెలంగాణ లో అధికార పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ , కేసీఆర్ కూతురు కవితను (MLC Kavitha) అరెస్ట్ చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Sam)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కానున్నారని.. ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) రంగం సిద్ధం చేస్తుందని అంటున్నారు. అలాగే కవితతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal
) పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం , ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా కవిత, కేజ్రీవాల్‌లకు ఈడీ ఉచ్చు బిగిస్తోందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి.

Read Also : Khammam : తుమ్మల చేరిక తర్వాత పొంగులేటి మాట మార్చాడా..?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచి అరెస్టు (MLC Kavitha Arrest) చేసే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమెను రెండు నెలలు జైలులో పెట్టి.. ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీ కలిసి కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. నిజంగానే కవితను అరెస్ట్ చేస్తారా..? అరెస్ట్ చేస్తే అది బిఆర్ఎస్ కు పెద్ద ప్లేస్ అవుతుందని మరికొంతమంది అంటున్నారు. కవిత అరెస్ట్ ను ప్రజల్లోకి కేసీఆర్ తీసుకెళ్లి మరింతగా సానుభూతి ఓట్లు రాబట్టుకుంటాడని కొంతమంది అంటున్నారు. మరి కవిత అరెస్ట్ అనేది జరుగుతుందా..లేదా అనేది చూడాలి.

  Last Updated: 25 Sep 2023, 01:26 PM IST