Brs mlc kalvakuntla kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలతో బాధపడ్డారు. తీవ్ర జ్వరంతో పలుమార్లు అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న కవిత ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చేరారు. సాయంత్రానికి పూర్తి వైద్య పరీక్షలు పూర్తి అవుతాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ సైతం ఆస్పత్రికి వచ్చారు. కాగా.. ఉన్నట్లుండి కవిత ఆసుపత్రిలోచేరారనే వార్తలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత #kavitha #BRSparty #HashtagU pic.twitter.com/QZ41WeKutY
— Hashtag U (@HashtaguIn) October 1, 2024
కాగా, లిక్కర్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15 కవితను అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 15న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా అదుపులోకి తీసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. కవితపై GNCTD చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (ToBR)-1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009, ఢిల్లీ ఎక్సైజ్‌ల ప్రాథమిక ఉల్లంఘించిందని కేసు నమోదు చేశారు. తాజాగా ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జిషీట్)ను రూస్ అవెన్యూ కోర్టులో సడ్మిట్ చేసింది. కవితతో పాటు ఇతర నిందితులు చన్‌ప్రీత్ సింగ్, దామోదర్, ప్రిన్స్ సింగ్, అరవింద్ కుమార్‌లపై చార్జిషీట్ దాఖలు చేశారు.
Read Also: Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..మల్లికార్జున ఖర్గేకు పరామర్శ