Site icon HashtagU Telugu

TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. నేడే కవిత సీబీఐ విచారణ

Mlc Kavitha

Mlc Kavitha

తెలంగాణ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi liquor scam)లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసుకు సంబంధించి నేడు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటికి సీబీఐ అధికారులు రానున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం 11 గంటలకు కవిత (MLC Kavitha) వివరణ తీసుకోనున్నారు. అయితే ఈనెల 6నే కవితను అధికారులు విచారించాల్సి ఉండగా.. ఆరోజున విచారణకు హాజరుకాలేనని కవిత లేఖ రాసింది. దీంతో నేడు కవితను అధికారులు విచారించనున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం చేసిన మద్యం కుంభకోణానికి సంబంధించి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను సీబీఐ నేడు (డిసెంబర్ 11) విచారించనుంది. విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థ అధికారులు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కవిత ఇంటికి చేరుకుంటారు. ఇప్పటికే కొన్ని పోస్టర్లు వెలిశాయి. సీబీఐ విచారణకు ముందు కవిత నివాసం చుట్టూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై ‘యోధుడి కూతురు ఎప్పుడూ భయపడదు’ అని రాసి ఉంది.

తెలంగాణ సీఎం కెసిఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో డిసెంబరు 6న సీబీఐ ఎదుట హాజరుకావాలని గతంలో ఆమెను సీబీఐ కోరింది. ఆ తర్వాత తన బిజీగా ఉన్నాను అని పేర్కొంటూ వేరే తేదీ ఇవ్వాలని సీబీఐకి విజ్ఞప్తి చేశారు కవిత. కవిత డిసెంబర్ 5న సీబీఐకి ఈ మేరకు లేఖ రాశారు. దీని తర్వాత డిసెంబర్ 11న కవిత ఇంటికి చేరుకుని విచారించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.

Also Read: Kidnap Update: కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. డెంటిస్ట్ వైశాలి కథ!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు రావడం గమనార్హం. దీనిపై కవిత మాట్లాడుతూ.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కేసులో ఏడుగురు నిందితులపై సీబీఐ నవంబర్ 25న తొలి చార్జ్ షీట్ దాఖలు చేసింది.