Site icon HashtagU Telugu

Telangana : బిఆర్ఎస్ మరో కీలక నేతను కోల్పోబోతుందా..?

Mlc Kasireddy Narayan Reddy

Mlc Kasireddy Narayan Reddy

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు..వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొంతమందైతే..పార్టీ ఫై అసంతృప్తి తో మరికొంతమంది పార్టీ ని వీడుతున్నారు. రీసెంట్ గా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి (Mynampally Hanumantha Rao ) పార్టీ కి రాజీనామా చేయగా..ఎల్లుండి ఈయన తో పాటు ఈయన కుమారుడు ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారు.

ఇదే క్రమంలో మరో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ బాట పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం (Kalwakurthy Assembly constituency) కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (MLC Kasireddy Narayana Reddy) బీఆర్‌ఎస్ ను వీడనున్నట్లు వినికిడి. 2018 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ టికెట్ కోసం నారాయణరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. జైపాల్ యాదవ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినప్పటికీ బిఆర్ఎస్ ను వీడకుండా జైపాల్ గెలుపుకు కష్టపడ్డాడు. కానీ, ఈ సారి నారాయణరెడ్డి కి టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెస్తుండడంతో..పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కల్వకుర్తి టికెట్ విషయమై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు ఆయనకు హామీ కూడా లభించిందని సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డితో కలిసి ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో నారాయణరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ లోకి భారీగా వలసలు చేరుతుండడం తో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.

Read Also : BC’s For 34: 119 స్థానాల్లో బీసీలకు 34 సీట్లు