MLC Kavitha Covid: కల్వకుంట్ల కవితకు ‌కరోనా

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

Published By: HashtagU Telugu Desk
Kavitha

Kavitha

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత, పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ అయింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు కవిత తెలిపారు.

తనను కలిసినవాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, మాస్కులు విధిగా ధరించాలని కోరారు. అయితే తన సోదరుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కేటీఆర్ కోలుకున్న కొద్దిరోజులకే కవిత కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో ఇతర జిల్లాలో కరోనా కేసులు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభావం ఎక్కువగానే ఉంది.

  Last Updated: 12 Sep 2022, 05:56 PM IST