Site icon HashtagU Telugu

MLC Kavitha: బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల కొత్త డ్రామా

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

MLC Kavitha : బాండ్ పేపర్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉంది… కానీ ఇప్పుడు ఆ చరిత్రను తుంగలో తొక్కి దారుణమైన స్థాయికి పార్టీ పడిపోయిందన్నారు.

కాంగ్రెస్ లో తాము సీనియర్ అని చెప్పుకునే జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, భట్టి విక్రమార్క బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజలు కాంగ్రెస్ ను ఎంత మేరకు నమ్ముతున్నారో క్లారిటీ వచ్చిందన్నారు. అప్పుడు కర్ణాటక ఎన్నికల్లోనూ ఇవే డ్రామాలు చేసి గెలిచారని.. అక్కడ 223 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసి ఇచ్చారని.. అమలులోకి వచ్చిన తర్వాత వేటినీ అమలు చేయలేదని మండిపడ్డారు.

అసలు కర్ణాటకలో ఇచ్చిన హామీల సంగతి ఏంటి.. మహిళలకు 2 వేల పెన్షన్ ఇస్తున్నారా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది? యువనిధి పథకం మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది. బియ్యం పథకం నడుస్తుందా? మహిళలకు ఉచిత బస్సులు అన్నారు.. తీరా చూస్తే బస్సుల సంఖ్య తగ్గించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దగ్గర్నుంచి.. డీకే శివకుమార్ వరకు అందరు నాయకులు చేసే పని ఇదే.. డ్రామాలు ఆడటం ఒక్కటే వీళ్లకు తెలుసు. ఆ డ్రామాలు తెలంగాణలో చెల్లవు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉంది. దానికి ఏం సమాధానం చెబుతారు అంటూ కవిత మండిపడ్డారు.