Site icon HashtagU Telugu

MLC K Kavitha Arrest : MLC కవిత అరెస్ట్

Kavitha Arrest

Kavitha Arrest

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తాజాగా బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా పాస్ ఛార్జీలు పెంచలేదు అని పేర్కొన్న ఆర్టీసీ, పెరిగిన నిర్వహణా ఖర్చుల నేపథ్యంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రయాణికుల పాస్ ధరలను 20 శాతం మేర పెంచింది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ.1,400కు పెరగగా, రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,600కు, అలాగే రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1,800కు పెరిగింది.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

ఈ బస్ పాస్ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), బస్ భవన్ వద్ద మంగళవారం నిరసనకు దిగారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ (Bus Bhavan) గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పాస్ ధరలను తక్షణం తగ్గించాలంటూ నినాదాలు చేశారు. పెరిగిన ఛార్జీలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని, విద్యార్థులకు మరింత ఇబ్బంది కలుగుతుందని ఆమె ఆరోపించారు.

CM Revanth Reddy : రాహుల్‌, ఖర్గేతో రేవంత్‌ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ..!

ఆందోళన సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కవితను అదుపు(Kavitha Arrest)లోకి తీసుకున్నారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తరలించారు. కవితను కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. బస్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మరింత తీవ్రమైన ఆందోళనలు నిర్వహిస్తామని కవిత హెచ్చరించారు. కవిత అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.