Jagityal Flexi War : జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ vs ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీల లొల్లి

బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో ఫెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని మునిసిపల్ సిబ్బంది తొలగించడం ఫై వివాదం చెలరేగింది

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 12:06 PM IST

బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay)..రీసెంట్ గా కాంగ్రెస్ లోకి రావడంతో జగిత్యాలలో రాజకీయ వేడి ఎక్కువైంది. సంజయ్ రాకను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy)..ఆయన వర్గీయులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న..పార్టీ కోసం పనిచేస్తున్న..ప్రతిపక్షం లో ఉన్నప్పుడు..అధికార బిఆర్ఎస్ ఎన్ని ఆఫర్లు ఇచ్చిన పార్టీ మారలేదు..అలాంటిది నాకు తెలియకుండా నా ప్రత్యర్థిని ఇలా పార్టీలోకి చేర్చుకుంటారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకానొక టైం లో పార్టీ మారేందుకు కూడా సిద్ధం అయ్యాడు. కానీ ఢిల్లీ పెద్దలు ఆయనతో మాట్లాడేసరికి కాస్త శాంతించాడు. ఇక అంత సెట్ అయ్యిందని అనుకుంటున్నా టైం లో ఇప్పుడు మరో వివాదం ఆయన్ను ఆగ్రహానికి గురి చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

జగిత్యాల లోని 8వ వార్డులో బేడబుడగ జంగాల కాలనీ వాసులు బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో ఫెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని మునిసిపల్ సిబ్బంది తొలగించడం ఫై వివాదం (Flexi War) చెలరేగింది. ఈ విషయం జీవన్ రెడ్డి కి తెలియడం తో అక్కడికి చేరుకున్నారు. మూడు రోజుల తరువాత ఉన్న కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయం ఏర్పాటు చేస్తే వెంటనే ఎలా తొలగిస్తున్నారంటూ ప్రశ్నించారు. వీటిని ఎందుకు తీసేసారు..? ఎవరు తీసేయమన్నారు..? అని ప్రశ్నించగా.. టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్వి తీసేయమన్నారని చెప్పడం తో జీవన్ రెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత తొలగిస్తే ఎవరికి అభ్యంతరం లేదని.. మూడు రోజుల్లో ఉన్న ప్రోగ్రాం కు సంబంధించిన ప్లెక్సీ ఏలా తొలగిస్తారని.. నిబంధనల మేరకు మెదులుకుంటే అభ్యంతరం లేదని.. ప్లెక్సీ తొలగింపు పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫోటో లేనందుకే తొలగించారని కొంతమంది అంటున్నారు.

Read Also : Government Employees : కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అంత చులకనా..?