Site icon HashtagU Telugu

Mlc Jeevan Reddy : కేసీఆర్ కు ఏ విషయం పూర్తిగా తెలియదు..తెలుసుకునే ప్రయత్నం చేయడు..!!

Jevanreddy

Jevanreddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ కు ఏ విషయంపైనా పూర్తి అవగాహన ఉండదు…తెలుసుకునే ప్రయత్నం అస్సలు చేయడు..ఎవరైనా చెప్పినా వినడు అని మండిపడ్డారు. అసలు గిరిజన రిజర్వేషన్లు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అమలు చేయవచ్చాన్నారు. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో తాము చెప్పినట్లుగా గుర్తుచేశారు జీవన్ రెడ్డి. కేసీఆర్ కల్పిస్తామన్న పదిశాతం రిజర్వేషన్లు కేవలం రాష్ట్రంలో మాత్రమే వర్తిస్తుందన్నారు. దీని అమలు విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇంతకాలం కేంద్రం ఆలస్యం మేరకు అమలు చేయలేదన్న నెపం వేస్తున్నారని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్ అంశాన్ని ముస్లిం రిజర్వేషన్ తో జత చేశారు. 50శాతం మించి ఇవ్వకూడదన్న విషయం రాజ్యంగంలో ఎక్కడా లేదన్నారు. అయినప్పటికీ కేంద్రానికి ఎందుకు నివేదించారు అని ప్రశ్నించారు. 7 ఏళ్లుగా కేసీఆఱ్ నిర్లక్ష్యం వల్లే గిరిజనులు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేన్లు కోల్పోయారని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అన్నారు.

గిరిజన బంధు అంటున్న కేసీఆర్…భూమి లేనివారికే ఇవ్వాలంటూ షరతు పెడుతున్నారన్నారు. షరతులు లేకుండా గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటల్లో ఎలాంటి క్లారిటీ ఉండదని…మొదట చెప్పేది ఒకటి…చివరికి చేసేదొకటి అన్నారు. కేసీఆర్ మాటలన్నీ కుట్రపూరితంగానే ఉంటాయన్నారు జీవన్ రెడ్డి.