MLC By Poll : కాసేపట్లో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..ఆ తర్వాత మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికలు జరిగాయి..ఇక ఎల్లుండి ఖమ్మం - నల్గొండ - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 12:57 PM IST

తెలంగాణ లో గత ఆరు నెలలుగా వరుస ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..ఆ తర్వాత మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికలు జరిగాయి..ఇక ఎల్లుండి ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఇలా వరుస ఎన్నికలతో రాష్ట్రం మొత్తం రాజకీపార్టీల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. ఇక కాసేపట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచార సమయం ముగింపుకు చేరుకోవడం తో అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఫై విమర్శల వర్షం కురిపిస్తూ వచ్చారు. నేటితో ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది.

Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం తమ్ముడు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేస్తున్న దర్శకుడు..