MLC By-Election Schedule : తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Mlc By Election Schedule

Mlc By Election Schedule

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 11న ఈ రెండు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇక నామినేషన్ల స్వీకరణకు ఈనెల 18వ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు. జనవరి 19 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఈనెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఎన్నిక అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వాస్తవానికి వారిద్దరి పదవీకాలం 2027 నవంబరు 30 వరకూ ఉంది. కానీ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది.

Read Also : Sridhar Babu : ఓడిన కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదు – మంత్రి శ్రీధర్ బాబు

  Last Updated: 04 Jan 2024, 08:08 PM IST