Site icon HashtagU Telugu

Koushik Reddy : కౌశిక్ రెడ్డి ఆంబోతులా తయారయ్యాడు – ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Venkat Kaushika

Venkat Kaushika

బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (MLC Balmur Venkat) తీవ్రంగా విమర్శలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి చేసినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ..కౌశిక్ రెడ్డి(Kaushik Reddy Padi).. ఆంబోతులా తయారయ్యాడని, ఆయనను కానిస్టేబుల్ అడ్డుకున్నా.. సోషల్ మీడియాలో పెట్టుకుంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కౌశిక్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్లను వెన్నుపోటు పొడిచాడని, ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు వసూలు చేశాడని, ఆఖరికి ఆయన పీఏ(PA)ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు చేశారు. అసలు డ్రగ్స్ టెస్ట్(Drugs Test) ఎక్కడ ఇయ్యాలో కూడా ఆయనకు తెలియదని, కొకైన్ తీసుకునే వాడితో సంబంధం ఏంటో చెప్పాలని నిలదీశారు.

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తప్పు చేయకపోతే.. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారని, కోర్టు(Court)కు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. చీకటి కోణాలు బయటపడతాయని బిఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మీటింగ్(Public Meetings) పెడితే కూడా అరెస్టులు చేశారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని, బీఆర్ఎస్ వాళ్లు ధర్నా చేసినా అనుమతి కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

Read Also : NBK109 : టైటిల్ ఫిక్స్ అయినట్లేనా..?