NEET Paper Leakage : 24 లక్షల మంది విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి – బల్మూరి వెంకట్

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 04:05 PM IST

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌ వ్యవహారంఫై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ , తల్లిదండ్రులు ఆందోలన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నేడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ వారంతా డిమాండ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు ఎమ్మెల్సీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ సైతం నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌ వ్యవహారం ఫై ప్రధాని మోడీ 24 లక్షల మంది విద్యార్థులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. NSUI, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు హైదరాబాద్ లో ‘స్టూడెంట్ మార్చ్’ నిర్వహించాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని.. నారాయణగూడ YMCA నుంచి హిమాయత్ నగర్ మీదుగా.. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలపై… సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి.. దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారితంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని కోరారు. ఈ పరీక్షలో ప్రశ్నాపత్నం లీక్ అయ్యిందా.. లేక మాస్ కాపీయింగ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమోద్​కుమార్ జోషీ ఉన్న చోట లీకేజీలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు.

Read Also : NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’‌పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్