MLAs Jump : `సిట్`కు ఛాలెంజ్! హైద‌రాబాద్ కు సంతోష్‌! ఎమ్మెల్యేల ఎర ఉత్కంఠ‌!

ఎమ్మెల్యేల ఎర కేసు(MLAs Jump)లో సంతోష్‌ ప్ర‌ధాన సూత్ర‌ధారిగా పోలీసులు గుర్తించారు.

  • Written By:
  • Updated On - December 28, 2022 / 03:37 PM IST

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌ ఆయ‌న పేరు ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. ఎమ్మెల్యేల ఎర కేసు(MLAs Jump)లో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఆయ‌న్ను తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఆ మేర‌కు విచారించ‌డానికి సిట్ (Sit)నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఆయ‌న నివాసానికి వెళ్లి సిట్ నోటీసుల‌ను అంటించింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరింది. కానీ, సిట్ నోటీసులకు సానుకూలంగా సంతోష్ స్పందించ‌లేదు. హైకోర్టు నుంచి నోటీసులపై స్టే ఆర్డ‌ర్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు నేరుగా ఆయ‌న హైద‌రాబాద్ లో మ‌కాం పెట్టారు. మూడు రోజుల పాటు బీజేపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఇప్పుడు తెలంగాణ పోలీస్ సిట్(Sit) ఏమి చేస్తుంది? అనేది ఆస‌క్తిక‌ర అంశం.

Also Read : FarmHouse Files : `ఫామ్ హౌస్` ఫైల్స్ కు `ఫోన్ ట్యాపింగ్` చెక్

హైదరాబాద్ వేదికగా బుధ‌వారం (28వ తేదీ) నుంచి 30వ తేదీ వరకు కార్యకర్తల శిక్షణ తరగతులను బీజేపీ నిర్వ‌హిస్తోంది. ఆ కార్యక్రమానికి బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. ఈనెల 29న జ‌రిగే అసెంబ్లీ ఇంఛార్జులు, కన్వీనర్లు, విస్తారక్‌లు, పాలక్‌లకు దిశానిర్దేశం చేస్తారు. కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ , సునీల్ బన్సల్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరవుతారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ తరగతులను నిర్వ‌హిస్తున్నారు. మూడో రోజుల పాటు హైద‌రాబాద్ లోనే ఉండే సంతోష్ ను సిట్ అదుపులోకి తీసుకునే ధైర్యం చేస్తుందా? అనేది ప్ర‌శ్న‌.

ఎమ్మెల్మేల ఎర (MLAs Jump)

ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్మేల ఎర (MLAs Jump) వ్య‌వ‌హారం న‌డిచింది. ఆ రోజున తెలంగాణ ఏసీబీ రైడ్ చేసింది. కానీ, డ‌బ్బు మాత్రం దొర‌క‌లేదు. కొన్ని ఆడియోలు, వీడియోల‌ను మాత్రం తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కెచ్ ప్ర‌కారం సీసీ కెమెరాల్లో మొత్తం ఎపిసోడ్ ను చిత్రీక‌రించారు. బీఎల్ సంతోష్ ఆదేశం ప్ర‌కారం ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడుతున్నామ‌న్న‌ వాయిస్ ఉంద‌ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెబుతున్నారు. ఆ వీడియోల‌ను దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టు, సుప్రీం కోర్టు, వివిధ పార్టీల చీఫ్ ల‌కు పంపారు. రాజ్యాంగబ‌ద్ధ సంస్థ‌లన్నింటికీ వీడియోల‌ను పంప‌డం ద్వారా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టిన ఎపిసోడ్ ల‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌చేశారు. ఆ కేసును మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయ‌డానికి తెలంగాణ పోలీసు ఉన్న‌తాధికారుల‌తో కూడిన సిట్ ఏర్పాటు చేశారు.

Also Read : BRS MLAs Secret Meeting: ఎమ్మెల్యేల రహస్య భేటీ.. బీఆర్ఎస్ లో హైడ్రామా

విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికే న‌లుగురు నిందితుల‌ను జైలుకు పంపిన సిట్ వాళ్ల వాగ్మూలాల‌ను సేక‌రించింది. దాని ప్ర‌కారం బీఎల్ సంతోష్ ప్ర‌ధాన సూత్ర‌ధారిగా నిర్థారించింది. ఆ మేర‌కు నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ల‌కుండా రెడ్ కార్న‌ర్ నోటీసుల‌ను ఇష్యూ చేయ‌డం కూడా క‌ల‌క‌లం రేపింది. ఇప్పుడు స‌రాస‌రి హైద‌రాబాద్ కు వ‌చ్చిన సంతోష్ మీద తెలంగాణ సిట్ ఏమి చేస్తుంది? అనేది ఈ మూడు రోజుల ఉత్కంఠ‌. తెలంగాణ సిట్ నుంచి ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాల‌ని హైకోర్టులో బీజేపీ పిటిష‌న్ వేసింది. దానిపై విచార‌ణ చేసిన న్యాయ‌స్థానం కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ తీర్పు చెప్పింది. కానీ, విచార‌ణ మార్గ‌మ‌ధ్యంలో ఉన్నందున మ‌రిన్ని క్లూల‌ను సేక‌రించ‌డానికి సిట్ గ‌డువు కోరింది. కానీ, హైకోర్టు మాత్రం సీబీఐకి కేసును అప్పగించింది. ఆ ప్ర‌కారం ఆధారాల‌ను తెలంగాణ సిట్ అనివార్యంగా సీబీఐకి అప్ప‌గించాలి.

పార్టీల మ‌ధ్య డ్రామా

ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఎల్ సంతోష్ ను సిట్ ట‌చ్ చేసే అవ‌కాశం ఉందా? అంటే, ధైర్యం చేయ‌లేర‌ని బీజేపీ భావిస్తోంది. న్యాయ సంబంధ చిక్కుల‌ను అధ్య‌య‌నం చేసిన త‌రువాత సంతోష్ ను అదుపులోకి తీసుకోవ‌డానికి సిట్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మ‌ధ్య ఎమ్మెల్మేల కేసు, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ మ‌ధ్య క్విడ్ ప్రో కో న‌డుస్తుంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సంతోష్ ను సిట్ అదుపులోకి తీసుకోకుండా ఉంటే ఆ రెండు పార్టీల మ‌ధ్య డ్రామా నడుస్తుంద‌ని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read : BRS MLA Rohith Reddy: రోహిత్ రెడ్డికి కేసీఆర్ ‘లీగల్’ సపోర్ట్