Supreme Court : బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు స్పీకర్‌తో సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Read Also: BJP : బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?: ఎంపీ లక్ష్మణ్
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం రెండు పిటిషన్లను విచారించింది. 22వ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక, ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ఎస్ గవాయి మాట్లాడుతూ.. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే దాకా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి..? ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను డివిజన్ బెంచ్ రివర్స్ చేసింది. ఇప్పటికి ఏడాది పూర్తయింది. కావాలని ఆలస్యం చేస్తున్నారు అని సుందరం పేర్కొన్నారు. అనర్హత పిటిషన్ పై సుప్రీం కోర్టు తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత, తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో చూడాలి.
Read Also: Posani : ఆదోని పోలీస్ స్టేషన్ కు పోసాని ..ఎందుకంటే?