Site icon HashtagU Telugu

Trouble in BRS: ఎమ్మెల్యే వర్సెస్ మేయర్.. బీఆర్ఎస్ లో అంతర్గత పోరు!

trouble in brs

Brs

టీఆర్ఎస్ బీఆర్ఎస్ (BRS)గా మారినా ఆ పార్టీలో అంతర్గత పోరుకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. మేడ్చల్ (Medchal) నియోజకవర్గానికి చెందిన ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కి వ్యతిరేకంగా నిర్వహించిన సీక్రెట్ మీటింగ్ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరును ఎత్తిచూపింది. తాజాగా మరోసారి నేతల మధ్య విబేధాలు చోటుచేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. అయితే ఎమ్మెల్యే (Uppal MLA) ను లేకుండా పనులు ప్రారంభించడంతో ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి అనుచరులు అడ్డుకున్నారు.

ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ మేయర్‌ (Mayor)తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో సుభాష్‌రెడ్డి ఒకరు. ఎమ్మెల్యే అనుచరులతో మేయర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు, మేయర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.కార్యక్రమానికి రాని ఎమ్మెల్యే (MLA)నే కారణమని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌తో పాటు ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్‌ని ఆహ్వానించారని విజయలక్ష్మి తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని మంగళవారం నాటికి రీషెడ్యూల్ చేయాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థించారు.

“ఎమ్మెల్యే రాకపోతే, తప్పు ఎవరిది” అని మేయర్ ప్రశ్నించారు. “నేను మేయర్‌ని. నన్ను ఎవరూ ఆపలేరు. ఎమ్మెల్యేను ఆహ్వానించాల్సిన అవసరం లేదు’’ అంటూ మండిపండింది. దీనిపై సుభాష్‌రెడ్డి స్పందించారు. ‘‘రాష్ట్ర సాధన నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్‌ నాయకుడిని.. ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గాలకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారి భాగస్వామ్యంతోనే అన్ని కార్యక్రమాలు చేపట్టాలి. జీహెచ్‌ఎంసీ నిధులతో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలను ఆహ్వానించాల్సిన అవసరం లేదని మేయర్ (Mayor) విజయలక్ష్మి పేర్కొంటున్నారు. అలా అయితే కేవలం ఉప్పల్ నియోజకవర్గంలోనే ఎందుకు పర్యటిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరికొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆమె అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు.. దీని వెనుక ఏదో రహస్య అజెండా ఉంది. ఆమె నన్ను పట్టించుకోకపోవడం ఇది మొదటిసారి కాదు నాలుగోసారి ” అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే (MLA). గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాలో అంతర్గత పోరు తలెత్తుతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ విషయమై సీనియర్ నాయకుడు మాట్లాడుతూ గ్రూపు తగాదాలు కేవలం ప్రగతి భవన్ (Pragathi Bhavan) లో చర్చకు మాత్రమే దారితీస్తున్నాయని, పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version