MLA Vivekananda: కేటీఆర్ ఒత్తిడి చేశారనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదు.. రేవంత్‌, ర‌ఘునంద‌న్‌పై ఫైర్‌

టీపీసీసీ(TPCC) ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి(Revanth Reddy), బీజేపీ(BJP) ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద(BRS MLA Vivekananda) ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 06:35 PM IST

టీపీసీసీ(TPCC) ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి(Revanth Reddy), బీజేపీ(BJP) ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద(BRS MLA Vivekananda) ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే మాట‌లు మాట్లాడ‌డ‌ని, మ‌తిస్థిమితం కోల్పోయి ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని వివేకానంద మండిప‌డ్డారు. ఓఆర్ఆర్ బిడ్దింగ్ పై రేవంత్ రెడ్డి క‌నీస అవ‌గాహ‌న లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ను బేస్ చేసుకొని ఆరోప‌ణ‌లు చేశాడ‌ని అన్నారు. 10శాతం నిధులు క‌ట్టాల‌ని కేటీఆర్ ఒత్తిడి చేశార‌నే రేవంత్ ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, కేవ‌లం రేవంత్ రెడ్డి త‌న పీసీసీ ప‌ద‌విని అడ్డుపెట్టుకొని డ‌బ్బులు వెనుకేసుకోవాల‌ని ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని వివేకానంద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఓఆర్ఆర్ బిడ్డింగ్‌పై ఏ విచార‌ణ‌కైనా సిద్ధంగా ఉన్నామ‌ని, రేవంత్ రెడ్డి వ‌ద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాల‌ని ఎమ్మెల్యే వివేకానంద స‌వాల్ చేశారు. మంత్రి కేటీఆర్ పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసినందుకు రేవంత్ రెడ్డి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ పీసీసీ ప‌ద‌వికి గండం వ‌చ్చింది. కాంగ్రెస్ నాయ‌కులంతా రేవంత్ ను పీసీసీ నుంచి తొల‌గించాల‌ని ఏక‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో త‌న పీసీసీ ప‌ద‌విని కాపాడుకొనేందుకు తెలంగాణ స‌మాజాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమ‌ర్శించారు. కేటీఆర్ ను వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది పెట్టాల‌ని రేవంత్ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, కానీ ఆయ‌న మాట‌లు తెలంగాణ స‌మాజం న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని, త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌జ‌ల్లో మ‌రింత చుల‌క‌న కావ‌ద్దంటూ రేవంత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద‌ హిత‌వు ప‌లికారు.

111 జీవో విష‌యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునంద‌న్ రావు అవ‌గాహ‌న లేమితో మాట్లాడుతున్నాడ‌ని వివేకానంద విమ‌ర్శించారు. 111 జీవో ఎత్తివేయాల‌ని లోక‌ల్ కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు తీర్మానాలు చేశార‌ని, మ‌రి వాళ్ల‌ను స‌స్పెండ్ చేస్తారా అంటూ ర‌ఘునంద‌న్ రావును ప్ర‌శ్నించారు. ర‌ఘునంద‌న్‌కు ద‌మ్ముంటే 111 జీవో ఎత్తివేయొద్ద‌ని, జీవో ఉండాల‌ని ఆ గ్రామాల్లోకి వెళ్లి మాట్లాడాల‌ని అన్నారు. 111 జీవో ప‌రిధిలోఉన్న గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు మాట్లాడాల‌ని అన్నారు. రఘునందన్ రావుకు దమ్ముంటే విచారణ చేయించాలని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు.

 

Also Read :  Priyanka Gandhi: ప్రియాంక చరిష్మా తెలంగాణాలో వర్కౌట్ అయ్యేనా?