BRS Ticket War: తెలంగాణ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ అంటుకుంది. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడ అవకాశాలు చూసి కుదిరితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ టికెట్ ఆశించిన కొందరు ఆశావహులు భంగపడ్డారు. తాజాగా కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో మెజారిటీ శాతం సిట్టింగులకే సీట్లు కేటాయించారు. దీంతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడుతుంది.
సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. టిక్కెట్టు దక్కని కొద్ది మంది పార్టీ నాయకులు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు నివేదికలు వెలువడ్డాయి. మెజారిటీ సభ్యులు కాగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ లో అలజడి సృటించాడు మైనంపల్లి హనుమంతరావు. మెదక్ నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రి హరీశ్‌రావును బహిరంగంగా హెచ్చరించాడు. అవినీతి ఆరోపణలు కూడా చేసిండు. దానికి కారణం తన కుమారుడు రోహిత్‌రావుకు టికెట్ కోసం ప్రయత్నించాడు. దానికి హైకమాండ్ నో చెప్పడంతో అతను బీఆర్ఎస్ పై ఈ తరహా వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. పార్టీ తరుపున రెండు టిక్కెట్లు ఇస్తే పోటీ చేస్తానని మైనంపల్లి తెగేసి చెప్పాడు.
ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రేఖకు టికెట్ దక్కకపోవడంతో ఆమె త్వరలో కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక కేసీఆర్ సన్నిహితుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కి కేసీఆర్ షాక్ ఇచ్చిండు పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. కానీ కెసిఆర్ లిస్టులో తుమ్మల పేరు లేకపోవడం ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల అనుచరులు అతనితో రహస్య మానతలు జరిపారు. ఈ మేరకు త్వరలోనే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక తుమ్మలకు కాంగ్రెస్ నుండి ఇప్పటికే ఆఫర్ వచ్చిందట.
Also Read: Hyderabad Rape: మీర్‌పేట అత్యాచార సమగ్ర నివేదిక కోరిన తమిళిసై