రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరిన భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (MLA Tellam Venkat Rao )..తనపై విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ నేతలకు గట్టి హెచ్చరిక జారీ చేసారు. బీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే భద్రాచలంలో అడుగుపెట్టనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం మొత్తంలో భద్రాచలం నుండి గెలిచినా ఏకైక బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడం తో బిఆర్ఎస్ లో చేరి..భద్రాచలం టికెట్ సంపాదించి..గెలిచి బిఆర్ఎస్ కు కాస్త ఊపిరి పోసిన వ్యక్తి. బిఆర్ఎస్ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లోకి చేరిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. రాజకీయ అనుభవం లేని ఎమ్మెల్సీ తాతా మధుకు నన్ను విమర్శించే స్థాయిలేదని, ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ నిధులతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. భద్రాచలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా రాజకీయ గురువు అని పేర్కొన్నారు.
Read ALso : Hyderabad: హైదరాాబాద్ లో అడుగంటుతున్న జలాలు.. జీహెచ్ ఎంసీ అలర్ట్