MLA Seethakka: కోవర్ట్ రెడ్డిని పక్కన పెట్టాల్సిందే.. వెంకట్ రెడ్డిపై సీతక్క ఫైర్!

మునుగోడు ఉప ఎన్నిక ముగింట టీకాంగ్రెస్ లో తుఫాను రేగుతోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహరం కాంగ్రెస్ లోనే కాకుండా

  • Written By:
  • Updated On - October 25, 2022 / 11:36 AM IST

మునుగోడు ఉప ఎన్నిక ముగింట టీకాంగ్రెస్ లో తుఫాను రేగుతోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహరం కాంగ్రెస్ లోనే కాకుండా ఇతర పార్టీలోనూ చర్చనీయాంశమైంది. విదేశీ టూర్ లో ఉన్న కోమటిరెడ్డి మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మునుగోడులో తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదని ఆయన అభిమానులతో తేల్చి చెప్పడం కూడా మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి దుర్మార్గున్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన పెట్టాల్సిందే, కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ సిగ్గుమాలిన చర్య అని సీతక్క విమర్శించారు. హై కమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బందాలకతీతమే రాజకీయం, నిబద్దత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు,సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సీతక్క సూచించారు. తమ్ముడి గెలుపే వెంకట్ రెడ్డి కి ముఖ్యమైతే, కాంగ్రెస్ కండువా వదిలేయాలని ప్రశ్నించారు. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని,  కాంగ్రెస్ శ్రేణులపై టీఆరెఎస్, బిజెపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని, ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియా కు పోవడం ఎంతవరకు కరెక్ట్ ? అని సీతక్క వెంకట్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.