Site icon HashtagU Telugu

Raja Singh: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో మార్మోగిన రాజసింగ్ పేరు..!!

Rajasingh

Rajasingh

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ ముగింపు సభలో రాజాసింగ్ పేరు మార్మోగింది. బీజేపీ నేతలు వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్,..రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజాసింగ్ ఎక్కడ అంటూ గట్టి అరుస్తూ…రచ్చ చేశారు. అంతేకాదు రాజాసింగ్ పై మాట్లాడలంటూ డిమాండ్ చేశారు కార్యకర్తలు. వెంటనే కలుగజేసుకున్న బండి సంజయ్…కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. తాము జైలుకు భయపడే వ్యక్తులం కాదన్నారు. జైలుకు పంపినవారిని, కుట్రపన్నిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని బండిసంజయ్ స్పష్టం చేశారు.

నెలరోజుల క్రితం తెలంగాణ రాజకీయాలన్నీ కూడా రాజాసింగ్ చుట్టే తిరిగాయన్న సంగతి తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో రాజాసింగ్ పై తీవ్రవిమర్శలు వచ్చాయి. ముస్లిం సంఘాలు పెద్దెత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే రాజాసింగ్ పై పీడీ యాక్్ పెట్టి..చర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్ జైలుకు వెళ్లాక …బీజేపీ నేతలు ఎవరూ కూడా స్పందించలేదు. రాజాసింగ్ కు మద్దతుగా నిలబడలేదు. ఎక్కడకూడా ఆయన మాటెత్తలేరు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ ముగింపు సభలో కార్యకర్తలు నినాదాలు చేశారు.