Site icon HashtagU Telugu

Rajaiah vs Kadiam : మ‌ళ్లీ ర‌చ్చ‌కెక్కిన బీఆర్ఎస్ నేత‌లు.. దమ్ముంటే తేల్చుకుందాం రా.. కౌంటర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌..

Rajaiah Vs Kadiam

Rajaiah Vs Kadiam

జ‌న‌గామ జిల్లా (Janagama district) లో స్టేష‌న్‌ ఘ‌న‌పూర్ (station ghanpur) నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్లు మాట‌ల యుద్ధం సాగుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌వేళ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లో వీరి లొల్లి అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఎమ్మెల్యే రాజ‌య్య‌ (MLA Rajaiah) పై ఇటీవ‌ల‌ లైంగిక వేదింపుల ఆరోప‌ణ‌లు రావ‌టం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘ‌ట‌న మ‌ర్చిపోక ముందే రాజ‌య్య‌, క‌డియం (Kadiam) మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వ‌ర‌కు వెళ్లింది. గ‌త రెండు రోజుల క్రితం రాజ‌య్య ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌కు ఎమ్మెల్సీ క‌డియం కౌంట‌ర్ ఇచ్చారు.

క‌డియం మీడియాతో మాట్లాడుతూ..

స్థానిక ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర స్థాయిలో నన్ను విమర్శిస్తున్నారు. కారణం ఏంటో తెలీదు కానీ, నాపై వ్యక్తిగతంగా నా తల్లి, బిడ్డపై స్థాయిని మరిచి నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు అంటూ క‌డియం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈనెల 7న రాజ‌య్య మాట్లాడిన విషయాలను చూసి బాధపడ్డాను. 2014, 2018 లో రెండుసార్లు పార్టీ నిర్ణయం మేరకు రాజయ్య గెలుపుకోసం కష్టపడి పనిచేశాను. నా అభిమానులకు నచ్చచెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజయ్య గెలుపు కోసం కృషి చేశాను. సొంత పార్టీ ఎమ్మెల్సీ అని చూడకుండా, పార్టీ నియమాలను చూడకుండా నాపై, నా కుటుంబం పై దాడి చేస్తుండు అంటూ క‌డియం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విషయాన్ని కేసిఆర్ దృష్టికి తీసుకెళ్ళాను. పార్టీ లైన్ దాటి వెళ్తున్నాడు సైలెంట్ గా ఉండు అని కేసీఆర్ చెప్పారు. నా కులం, నా తల్లి కులం గురించి మాట్లాడుతున్నారు. సుప్రీం కోర్టు పిల్లలకు తండ్రి కులం వస్తుందని తీర్పులు ఇచ్చింది. తల్లి సత్యం, తండ్రి అపోహ మాత్రమే అని మాట్లాడారు. అదే సూత్రం రాజయ్యకు కూడా వర్తిస్తుంది. సమాజంలో ప్రతిఒక్కరి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడుతున్నాడు. బేషరతుగా మహిళా లోకానికి రాజ‌య్య‌ క్షమాపణలు చెప్పాలని శ్రీ‌హ‌రి డిమాండ్ చేశారు.

నాకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని రాజయ్య ఆరోపించారు. నా ఆస్తుల వివరాలు తెస్తే ఘనపూర్ దళిత బిడ్డలకు రాసిస్తానని క‌డియం అన్నారు. ఎమ్మెల్యే రాజయ్యకు వారం సమయం ఇస్తున్నాను. వివరాలు తేకుంటే క్షమాపణ చెప్పాలి. ఘనపూర్ నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామాన్ని ఎంచుకుందాం. ఎవరు ఏం చేశారో మీడియా సమక్షంలో తేల్చుకుందాం అంటూ రాజ‌య్య‌కు క‌డియం శ్రీ‌హ‌రి స‌వాల్ విసిరారు. రాజయ్య చేష్టలను అధిష్టానం గమనిస్తుంది. శిశుపాలునిలా 100 తప్పులు చేసేవరకు కేసిఆర్ వేచి చూస్తున్నారు. శిశుపాలుని వధకు సమయం దగ్గర పడింది అంటూ శ్రీ‌హ‌రి రాజ‌య్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏం చేద్దామ‌ని చాటుగా మీటింగ్‌లు పెడుతున్నావు.. రాజ‌య్య‌

ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మరోసారి ఎమ్మెల్యే రాజయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డియం పద్మశాలి కులంలో పుట్టిన తర్వాత బైండ్ల కులంలో పెరిగాడు. ఆయ‌న చేసేవి మొత్తం బ్లాక్ మెయిల్ రాజకీయాలు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘన్పూర్ నియోజకవర్గంలో రాజకీయంగా దళితులు ఎదిగితే ఏదో కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. 14 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ దళిత బిడ్డను రాజకీయంగా ఎదగనీయలేదు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న మూడున్నర సంవత్సరాలు నియోజకవర్గానికి రాకుండా తిరిగావు.. నువ్వు 14 సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఘనపూర్ నియోజకవర్గ దగా పడ్డది అంటూ రాజ‌య్య విమ‌ర్శించారు. ఘనపూర్ నియోజకవర్గాన్ని ఏం చేద్దామని చాటుచాటు మీటింగులు పెడుతున్నావు. నీ కులం గురించి నువ్వు నిరూపించుకో.. ఏది ఏమైనా అక్కడ కేసీఆర్ ఇక్కడ రాజయ్య దళితులకు అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కావ్యకు ఇవ్వాలని అడుగుతున్నావని ఆధారాలు బయటకి వస్తున్నాయి. లింగంపల్లి ప్రాజెక్టు కావాలని ప్రజలు అడిగితే కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి శ్రీహరి అంటూ ఎమ్మెల్యే రాజయ్య విమ‌ర్శించారు.

Modi Cabinet : కేంద్ర మంత్రివ‌ర్గంలో `బండి` ప‌క్కా! జీవిఎల్ కు చిగురాశ‌!!