MLA Rajaiah: కడియంకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే రాజయ్య!

కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Rajaiah Vs Kadiam

Rajaiah Vs Kadiam

స్టేషన్ ఘన పూర్ లో పార్టీ టికెట్ ప్రకటించిన కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని  ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. ఈరోజు ప్రగతి భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ లీడర్లతో జరిగిన సమావేశం అనంతరం రాజయ్య పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు, ఆయన గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు.

పార్టీ రాజయ్య భవిష్యత్తుకు అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు,  పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించి, కడియం శ్రీహరికి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్‌ తనకు ఉన్నత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారని క్యాంపు కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన కార్యకర్తలకు వివరించారు. ఆ తర్వాత రాజయ్య తాను కచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటూ మాట్లాడారు. దీంతో ఆయన చూపు కాంగ్రెస్ పై  పడిందనే ప్రచారం జరిగింది. కాగా, రాజయ్యను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు టీపీసీసీ సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్ లో మంత్రాంగం నడిపి రాజయ్యను ఒప్పించారు.

Also Read: Lavanya Tripathi: పెళ్లికళ వచ్చేసిందే బాలా, మెగా కోడలు శారీ పిక్స్ వైరల్

  Last Updated: 22 Sep 2023, 12:27 PM IST