తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి(Telangana BJP chief)కి సంబంధించి అనేక ఊహాగానాలకు తెరపడింది. పార్టీ అధిష్ఠానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు (Ex-MLC Ramchander Rao ) పేరును ఖరారు చేసింది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలో రామచందర్ రావు సిద్ధమవుతున్నారు. ఆయన ఎంపికపై పార్టీలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఎంపికకు సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రకటించే అవకాశం ఉంది అన్న ప్రచారాన్ని పక్కన పెట్టి, హైకమాండ్ రామచందర్ రావు వైపే మొగ్గుచూపింది.
Sleeping : రాత్రిపూట మీరు ఎక్కువగా నిద్రపోకపోతే ఆ రోగాల బారిన పడినట్లే..!!
ఈ నియామకంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో వివాదంగా మారాయి. “నావాడు, నీవాడు అంటూ నాయకులను పై స్థాయి నుంచి నియమించుకుంటూ పోతే, పార్టీకి నష్టం తప్పదు” అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే సమయంలో పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఓటు హక్కు ఉండాలనీ, బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచీ కీలక నేతల వరకు ఓటేసి నాయకుడిని ఎంపిక చేయాలనేది రాజాసింగ్ అభిప్రాయం.
రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీలో లోపల విభేదాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు లోపల ప్రతిఘటన పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటే, మరోవైపు నేతల మధ్య సమ్మతితో ఉండని ఆచరణలు పార్టీ మౌలిక నిర్మాణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రామచందర్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విమర్శలు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిన అవసరం ఉంది.