Site icon HashtagU Telugu

Bonalu Festival : బోనాల పండుగ అంటే తాగే పండుగ – ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Rajasingh Bonalu

Rajasingh Bonalu

ఆషాడం మాసం (Ashada Masam) వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబరాలు (Bonalu celebrations) మొదలు అవుతాయి. ఊరు వాడ అనే తేడాలేకుండా భక్తులంతా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక హైదరాబాద్ లో అయితే బోనాల ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనాల సంబరాలు జరుపుకుంటారు. సామాన్య ప్రజలే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. గోల్కొండ బోనాల నుంచి మొదలుపెడితే.. మహంకాళీ బోనాలు, లాల్ దర్వాజా బోనాలను ఇలా అన్ని బోనాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈరోజు పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల వేడుక గ్రాండ్ గా జరిగింది. వేలాదిగా భక్తులు అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బోనాల పండుగ అంటే.. చాలా మంది యువత తాగడం, ఎగరడం మాత్రమే అనుకుంటుంన్నారని.. బోనాల పండుగ అంటే అది కాదన్నారు రాజాసింగ్ (MLA Rajasingh). బోనాల పండుగ అంటే.. మన ధర్మం, సంస్కృతి అని చెప్పుకొచ్చారు. మన సంస్కృతిని కాపాడటం మన అందరి బాధ్యత అని.. యువతకు ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. కొంత మంది మాత్రం.. బోనాల పండుగ అంటే తాగే పండుగ అని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని వివరించారు.

ఇక బోనాల పండుగలో హిందూ భక్తులు.. తమ కుటుంబం బాగుండాలని మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పిస్తారని , అయితే.. ఆ మేకను బలిచ్చే వాళ్లు ముస్లింలై ఉంటారని చెప్పుకొచ్చారు. హిందువుల్లో కూడా కొంత మంది మేకలను కోసేవాళ్లు ఉంటారని.. వారిని పిలిపించి కోపించుకోవాలని సూచించారు. ఎందుకంటే.. ముస్లిం వాళ్లతో కోపిస్తే.. వాళ్లు అల్లాకి సమర్పించేటట్టు ఫాతియా చదివి హలాల్ చేసి కోస్తారని.. దాంతో అది ఎంగిలి అవుతుందని తెలిపారు. అమ్మవారికి ఎంగిలి చేసిందని బలి ఇవ్వకూడదని.. హలాల్‌ని బహిష్కరణ చేయాలంటూ రాజాసింగ్ పిలుపునిచ్చారు. మరి దీనిపై ముస్లిం లు ,హిందువులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్ కు కొత్తమీ కాదు గతంలో ఎన్నో సార్లు ఈ తరహా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

Read Also : Janasena : మారువేషంలో ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్లిన జనసేన ఎమ్మెల్యే..