Site icon HashtagU Telugu

Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి

Telangana

Telangana

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ చిట్టా లాగుతున్నారు. రోజుకో అంశంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.

కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయని మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ సభ్యులను తన వైపుకు రానివ్వమని హెచ్చరించారు. నేను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేశాను. దొంగల పదవుల కోసం పార్టీలు మారలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత ప్రభుత్వం నాలుగు రూపాయలకు ఉన్న విద్యుత్‌ను ఆరు రూపాయలకు పెంచి తప్పు చేసింది. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ నేతల పరిస్థితి తలచుకుంటే బాధగా ఉంది. అద్దె ఇంట్లో ఉన్న మాజీ మంత్రికి వేల కోట్ల ఇల్లు ఎలా వచ్చాయని, సీఎం ముందు ధైర్యంగా మాట్లాడకపోవడంతో రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు.

కాగా రాజగోపాల్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఖబడ్దార్ అన్న సభ్యునిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పీకర్ చెప్పాలన్నారు.

Also Read: Apple iPhone 14 Plus: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ పై భారీ డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?