KCR Vs Congress : గులాబీ బాస్ కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఈ కోటాలో మొత్తం 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం బీఆర్ఎస్‌కు ఒక్కే ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కుతుంది. కానీ కేసీఆర్ ఈ పోల్స్‌లో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారట. అదేంటో తెలుసుకుందాం..
Also Read :Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖాయమేనా ?
బరిలోకి ఇద్దరు
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. తమతమ నియోజకవర్గాల డెవలప్‌మెంట్ కోసమే జంప్ చేశామని ఆయా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలంటూ కోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది సుప్రీంకోర్టు తాజాగా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. మార్చి 22 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో ప్రస్తుతం సదరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒత్తిడిలో ఉన్నారు. వారిపైన ఒత్తిడిని మరింత పెంచే దిశగా కేసీఆర్ కొత్త వ్యూహం ఉండబోతోందట. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం బీఆర్‌ఎస్‌కు ఒకే ఎమ్మెల్సీ సీటు దక్కుతుంది. అయినప్పటికీ 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడాలని గులాబీ బాస్ నిర్ణయించారని తెలుస్తోంది. ఇద్దరు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట.
Also Read :Mars In 30 Days: 30 రోజుల్లోనే అంగారకుడిపైకి.. ఇదిగో ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్
పోటీలో ఉన్న నేతలు వీరే
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(KCR Vs Congress) పోటీ చేయబోయే ఆ ఇద్దరు నేతలు ఎవరు ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ అధికారంలో ఉన్న టైంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని భావించారు. అయితే న్యాయ పరమైన చిక్కులతో అది సాధ్యం కాలేదు. ఈసారి ఆయన పేరును గులాబీ బాస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద బీసీ వర్గం నేతకు ఒక ఎమ్మెల్సీ సీటు తప్పక ఇవ్వాలని కేసీఆర్ డిసైడయ్యారట. దీంతో జోగు రామన్న, భిక్షమయ్య గౌడ్ సైతం పోటీలోకి వచ్చారని తెలిసింది. మరొక ఎమ్మెల్సీ అభ్యర్థి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగియనున్న సత్యవతి రాథోడ్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గం నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, రసమయి బాల కిషన్ పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయట.